జగిత్యాల టౌన్, వెలుగు: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలతో కేక్ కట్ చేయించారు. అనంతరం గ్రామంలోని మణిదీప, వినాయక గ్రామ పరస్పర సహాయక పొదుపు, పరపతి సహకార సంఘం నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లత, తదితరలు పాల్గొన్నారు.కోరుట్ల,వెలుగు: కోరుట్ల మున్సిపాలిటీలో ఆదివారం ప్రజాపాలన- పట్టణ ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ‘హ్యాపీ సండే’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు మ్యూజికల్ చైర్, ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం చైర్ పర్సన్ తిరుమల వసంత, కమిషనర్ రవీందర్, వైస్ చైర్‌పర్సన్ షాహెద్, కౌన్సిలర్లు, సిబ్బంది కలిసి మొక్కలు నాటారు.
