V6 News

నాడు చెల్లని రూపాయి.. ఇప్పుడెట్లా చెల్లుతడు?...జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి పై చేసిన విమర్శలు మర్చిపోయావా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?: మంత్రి అడ్లూరి

నాడు చెల్లని రూపాయి.. ఇప్పుడెట్లా చెల్లుతడు?...జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి పై చేసిన విమర్శలు మర్చిపోయావా కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌?: మంత్రి అడ్లూరి

జగిత్యాల, వెలుగు: గతంలో జీవన్ రెడ్డిని ‘చెల్లని రూపాయి’గా విమర్శించిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్.. ఇప్పుడు ఆయన ఎలా చెల్లుతారో, పార్టీలోకి ఎలా స్వీకరిస్తున్నారో ప్రజలకు చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు, రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 

శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు నందయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డికి పదవులు రాకపోవడం వల్లే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరుతున్నారని విమర్శించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ ఇచ్చిన పదవులను అనుభవించిన వ్యక్తి ఇప్పుడు అదే పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేయడం నైతికంగా కరెక్ట్ కాదన్నారు. మొన్నటిదాకా కేసీఆర్, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను విమర్శించిన జీవన్ రెడ్డి... ఇప్పుడు వారిని ప్రశంసించడం విడ్డురంగా ఉందన్నారు.