- మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణచారి, ప్రధాన కార్యదర్శికమలాకర్ రావు నేతృత్వంలోని ప్రతినిధులు మంత్రికి వినతిపత్రం అందించారు.
విద్యార్థుల ఇబ్బందులపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు రమేశ్, వెంకటరావు, శ్రీనివాస్, రత్న ప్రసాద్, సుజాత, సంధ్య, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
