కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతాడు ..నాకు ఎవ్వరి సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి అజారుద్దీన్

కిషన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతాడు ..నాకు ఎవ్వరి సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి అజారుద్దీన్

హైదరాబాద్: నాకు మంత్రి పదవి ఇవ్వడంపై కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు..మంత్రి పదవికి , జూబ్లీహిల్స్​ ఎన్నికలకు సంబంధం లేదు అన్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్.. గత కొంత కాలంగా నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. 

కేంద్ర మంత్రి కిషన్​ ఏదేదో మాట్లాడుతున్నరు.. నా దేశ భక్తి గురించి ఆరోపణలు చేస్తున్నారు.. కిషన్​ రెడ్డికి నాపై పూర్తి అవగాహన లేదు.. నాపై కేసులున్నాయంటున్నారు అవి ఎక్కడా నిరూపితం కాలేదు. ఎవ్వరి సర్టిఫికెట్​ నాకు అవసరం లేదన్నారు అజారుద్దీన్​. 

కేబినెట్ చోటు కల్పించిన సీఎం రేవంత్​ రెడ్డికి, పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ కు , రాహుల్​ గాంధీ, సోనియాగాంధీ, ఖర్గేలకు కృతజ్ణతలు చెప్పారు అజారుద్దీన్.జూబ్లీహిల్స్​ఎన్నికల్లో కాంగ్రెస్​ ను గెలిపించడమే నా తక్షణ కర్తవ్యం అన్నారు నూతన మంత్రి అజారుద్దీన్.