‘ప్రగతి ప్రణాళికపై’ మంత్రి దామోదర ప్రశంసలు

‘ప్రగతి ప్రణాళికపై’ మంత్రి దామోదర ప్రశంసలు

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ అద్భుతమైన పనితీరు కనబరిచిందని మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్ అవేర్‌‌‌‌‌‌నెస్ వీక్ ద్వారా ఆహార భద్రత, క్యాన్సర్ నియంత్రణ, మాతా-శిశు సంరక్షణ, మానసిక ఆరోగ్యం వంటి 20కి పైగా అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించారన్నారు.

నిమ్స్‌‌‌‌లో రూ.33 కోట్లతో లైనాక్​ సేవలు, రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్లు, 31 క్రిటికల్ కేర్ బ్లాక్‌‌‌‌లు, 35 డీ-అడిక్షన్ సెంటర్లు, ఏఐ ఆధారిత లంగ్​క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి విప్లవాత్మక సంస్కరణలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. గడిచిన రెండున్నర ఏళ్లలో సుమారు 15 వేల మంది వైద్య సిబ్బందిని భర్తీ చేసి ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేశామని తెలిపారు.