ఏఐతో డాక్టర్ల సామర్థ్యం మరింత మెరుగు : మంత్రి దామోదర రాజనర్సింహ

ఏఐతో డాక్టర్ల సామర్థ్యం మరింత మెరుగు : మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: ఏఐ డాక్టర్ల సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డాక్టర్ల చేతుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే శక్తివంతమైన సాధనంగా అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ టెక్నాలజీ మారాలని ఆయన ఆకాంక్షించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని హైటెక్ సిటీలో ఉన్న యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన “ఆరోగ్య రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు” ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

ఇప్పటివరకు వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించడంపైనే వైద్య వ్యవస్థ దృష్టి కేంద్రీకృతమై ఉండేదని తెలిపారు. ప్రస్తుతం ఏఐ, జీనోమిక్స్, అత్యాధునిక నిర్ధారణ సాంకేతికతలు, డిజిటల్ హెల్త్ పరిజ్ఞానం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించడం, నివారించడం, ప్రతి వ్యక్తికి తగిన చికిత్సను అందించడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఏఐ అంతిమ లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపరచడమే కావాలని మంత్రి తెలిపారు.