ప్ర‌తి ధాన్య‌పు గింజ‌ను కొనుగోలు చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానిదే

ప్ర‌తి ధాన్య‌పు గింజ‌ను కొనుగోలు చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానిదే

వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో పండిన ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేసే బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌న్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. వ‌రంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ నిర్మూలన, ధాన్యం-మక్కల కొనుగోలు, గోదాముల ఏర్పాటుతోపాటు తాజా పరిస్థితులపై సోమ‌వారం హన్మకొండ లోని నందనా గార్డెన్స్ లో మంత్రి సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఏ గ్రామ పరిధిలో పండిన పంటను ఆ గ్రామ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే అమ్మాలన్నారు. వరి, మక్కలు, మిర్చి పంట‌ల‌ను ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని చెప్పారు. మిర్చి బస్తాలను కోల్డ్ స్టోరేజ్ లో 6 నెలల పాటు భద్రపర్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. 6 నెలల పాటు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు.

మన రాష్ట్రంలో గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీలేక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పిన ఎర్ర‌బెల్లి.. వరంగల్ లో గ‌న్నీ బ్యాగ్స్ తయారీ పరిశ్రమ పెట్టడానికి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు చెప్పారు. క‌రోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నద‌ని.. అందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

minister errabelli dayakar rao review meeting at hanamkonda