ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలె

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలె

వరంగల్/రాయపర్తి: చదువుల కోసం అప్పులు చేసే రోజులు పోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూల్ లోనే చదవాలని  రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తిలోని కొండూరు గ్రామంలో నిర్వహించిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారుల పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు ఆసక్తి చూపేలా సర్కారు బడులను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు తెలంగాణా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. సంక్షేమ, అభివృద్ది పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. సీఎం కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా విజయవంతమవుతుందనడానికి రైతు బంధు, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, 24 గంటల కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి పథకాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లి దండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

‘పుష్ప’ మూవీ పాట పాడిన తమిళనాడు కలెక్టర్

రాజస్థాన్లో వింత వ్యాధి.. ఏడుగురు చిన్నారుల మృతి..