రాజస్థాన్లో వింత వ్యాధి.. ఏడుగురు చిన్నారుల మృతి..

రాజస్థాన్లో వింత వ్యాధి.. ఏడుగురు చిన్నారుల మృతి..

రాజస్థాన్లో చిన్నారులు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడి సిరోమి జిల్లాలో ఇప్పటికే ఏడుగురు పిల్లలు చనిపోయారు. వెంటనే అప్రమత్తమైన  అధికారులు జైపూర్, జోధ్ పూర్ నుంచి సిరోహీలోని ఫులాబాయి ఖేరా గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపారు. వారు పిల్లల నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించి వ్యాధి నిర్థారణకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి పర్సది లాల్ మీనా చెప్పారు. 

సిరోహీలో పిల్లలు ఎన్ సెఫాలిటిస్ వైరస్ వల్ల చనిపోయినట్లు వైద్య బృందం అనుమానిస్తోంది. అయితే ఈ విషయాన్ని నిర్థారించాల్సి ఉంది. ఏప్రిల్ 9 నుంచి 13వ తేదీ మధ్య 10 నుంచి 15ఏళ్ల లోపు వయసున్న ఏడుగురు పిల్లలు చనిపోయారని కలెక్టర్ భన్వర్ లాల్ చెప్పారు. వ్యాధి సోకిన పిల్లలు జ్వరం, మూర్ఛతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇంకెంత మంది పిల్లులు ఈ వ్యాధితో బాధపడుతున్నారో తెలుసుకునేందుకు ఆరోగ్య శాఖ ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. 

For more news..

రేపు వైన్ షాపులు బంద్

ప్రయాణికులకు మరోసారి షాకిచ్చిన టీఎస్ఆర్టీసీ