రాహుల్​ గాంధీ ఓయూలో మీటింగ్​ పెడితే ఎడ్యుకేషన్​ దెబ్బతింటది

రాహుల్​ గాంధీ ఓయూలో మీటింగ్​ పెడితే ఎడ్యుకేషన్​ దెబ్బతింటది

వరంగల్​ వస్తే ఖర్చులు పెట్టుకుంటా 
‘ ఉపాధి’ స్కీంపై సంజయ్​కి అవగాహన లేదు 
రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు 

వరంగల్‍, వెలుగు: ‘ఏఐసీసీ నేత రాహుల్‍గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చే క్రమంలో ఉస్మానియాలో అడుగుపెడితే అది ఎడ్యుకేషన్‍ పరంగా దెబ్బతింటది. ఆయనొచ్చి పబ్‍ గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారనే భావన ఉంది’ అని మంత్రి ఎర్రబెల్లి  దయాకర్​ రావు వ్యాఖ్యానించారు. చీఫ్​ విప్ ​వినయ్‍భాస్కర్‍, ఎమ్మెల్యే అరూరి రమేశ్‍, గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్‍తో కలిసి మంగళవారం హన్మకొండ ఆర్‍అండ్‍ బీ గెస్ట్ హౌజ్​లో విలేకరులతో మాట్లాడారు. రాహుల్​ గాంధీ ఓయూకు రావొ ద్దని  తాము చెప్పమని, యూనివర్సిటీ వీసీ నియ మించే కమిటీ ఆ విషయాన్ని డిసైడ్‍ చేస్తుందన్నారు. ఎవరొస్తే యూనివర్సిటీ బాగుపడుతుందో..ఎవరొస్తే చెడిపోతుందో వారే నిర్ణయిస్తారన్నారు. వరంగల్​లో కాంగ్రెస్‍ నేతలు 5 లక్షల మందితో నిర్వహిస్తామన్న ఆర్ట్స్​అండ్‍ సైన్స్​ కాలేజీ గ్రౌండ్‍ 20 ఎకరాలు ఉంటుందని.. ఒక్కో ఎకరానికి 4 వేల జనం మాత్రమే పడుతారన్నారు. ఈ లెక్కన ఎంతమంది పడతారో అర్థం చేసుకోవచ్చన్నారు. వరంగల్‍ సభతో కాంగ్రెస్‍ లేస్తది. పడ్తది. ఊగుతది.. ఊపుతాం అని రేవంత్‍రెడ్డి లాంటోళ్లు ఉపన్యాసం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్‍ సభ పెడితే 500 ఎకరాల్లో పెడతరు.. మీరు కూడా అలాపెట్టి లేసిందని చెప్పండి. కాపౌండ్‍లో పెట్టి ఊపుతం అంటే ఎట్లా’ అని సెటైర్ వేశారు.  

సంజయ్​...జూటా మాటలు బంద్​ చెయ్​..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ ఉపాధి హామీ పథకంపై జూటా మాటలు బంద్‍ చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. సంజయ్‍కు స్కీంపై కనీస అవగాహన లేదన్నారు. ఆ పథకంలో మూడు నెలలుగా కూలీలకు పైసలివ్వలేదని ​అంటున్నాడని, కానీ ఆ డబ్బులు కేంద్రమే కూలీల అకౌంట్లలో వేయాలనే విషయం ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. అలాగైతే అయన ఓ అజ్ఞాని అని అన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని, డబ్బులు ఆపాలని బీజేపీ ఎంపీలు సంజయ్‍, అరవింద్‍, బాపురావ్‍ గతంలో కేంద్రానికి లెటర్స్​ రాశారన్నారు. విచారణలో అవకతవలకు జరగలేదని తేలిందన్నారు. ఉపాధి స్కీం అమలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని, ఒకవేళ వరంగల్​కు వస్తానంటే ఖర్చులు కూడా తానే భరిస్తానన్నారు. కేంద్రం 20 ఉత్తమ గ్రామాలను సెలెక్ట్​ చేస్తే అందులో 19 తెలంగాణవే ఉన్నాయన్నారు. బండి సంజయ్‍, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు దత్తత తీసుకున్న గ్రామాలకు సైతం అవార్డులు  రాలేదని..కేసీఆర్‍ ప్రణాళికతో ముందుకెళ్లిన విలేజ్‍లకు అవార్డులు వచ్చాయన్నారు. మొత్తంగా 500 గ్రామాలకు అవార్డులొస్తే.. ఒక్క గుజరాత్‍ తప్పించి అన్ని తెలంగాణకే దక్కాయన్నారు. కేంద్రం పెంచిన పెట్రోల్‍, డీజిల్‍ ధరల వల్లే ఆర్టీసీ ఛార్జీలు పెంచామని, అది కూడా అందులో పనిచేసే కార్మికుల ప్రయోజనం కోసమేనన్నారు. కరీంనగర్‍కు మెడికల్‍ కాలేజీ తీసుకురాలేని బండి సంజయ్‍, పసుపు బోర్డు తేలేని అరవింద్‍, మరో విషయంలో లెటర్‍ రాసిచ్చిన ఆదిలాబాద్‍ ఎంపీలు దద్దమ్మలన్నారు.