
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగితే తమదే విజయమన్నారు మంత్రి హరీశ్ రావు. బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు లేని నెట్ వర్క్ తమకుందన్నారు. ఓటరును నేరుగా కలిసి టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో వివరించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తే వచ్చే లాభం ఏంటని.?..వాళ్లేమైనా అధికారంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతు బందును కేంద్రప్రభుత్వం కాపీ కొట్టి ఆరు వేల రూపాయలు ఇస్తుందన్నారు. పేదింటి అమ్మాయి పెళ్లికి లక్షరూపాయలు ఇస్తున్నామని… ఇదే కాపీ కొట్టి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. బీజేపీకి ఇవ్వాల్సినవి ఇవ్వడం చేతగాదన్నారు. సురభి వాణిదేవి పీవీ కుమార్తె కాకుండా విద్యావేత్తన్నాని.. సేవా భావం కలిగిన వ్యక్తన్నారు. ఏకైక మహిళా అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.