నడ్డా ..తెలంగాణ కేసీఆర్ అడ్డా.. నువ్వొచ్చి చేసేదేం లేదు: హరీశ్ రావు

నడ్డా ..తెలంగాణ కేసీఆర్ అడ్డా.. నువ్వొచ్చి చేసేదేం లేదు: హరీశ్ రావు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. నడ్డా .. ఇది కేసీఆర్ అడ్డా .. సొంత రాష్ట్రంలో  పార్టీని గెలిపించుకోలేని మీరు.. తెలంగాణకు వచ్చి చేసేదేమి లేదని వ్యాఖ్యానించారు.   తెలంగాణలో వచ్చేది హంగ్ కాదని.. ఎవరు అవునన్నా కాదన్నా..  మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే అన్నారు హరీశ్. బిజెపి డిపాజిట్ల కమిటీ వేసుకుంటే మంచిదని.. కనీసం డిపాజిట్లు అయినా వస్తాయన్నారు. అదిలాబాద్ జిల్లాలో పదికి పది సీట్లు  గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు హరీశ్.

కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మంటలు అంటూ సెటైర్లు వేశారు హరీశ్ రావు. సీఎం కుర్చీ కోసం మతం మంటలు రేపిన పార్టీ కాంగ్రెస్ అని.. నక్సలైట్లతో చర్చలు అని వారినే  మట్టు బెట్టిందని ఆరోపించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో  వచ్చాక  ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుందన్నారు.

అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడ్తనపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ కు 80 కోట్ల 50 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు హరీశ్. 1 టీఎంసీ గోదావరి నీటిని లిఫ్ట్ ఎత్తిపోయనుందన్నారు. గతంలో తలాపున గోదావరి పారిన నీటి కోసం ఇబ్బంది పడ్డామన్నారు.