
ఆరు గ్యారంటీల హామీని నెరవేరుస్తామన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల్లోనే 2 హామీలను నెరవేర్చిన సర్కార్ గతంలో ఏదీ లేదన్నారు. 100 రోజుల లోపు అన్ని కార్యక్రమాలను అమలవుతాయని చెప్పారు. విధ్వంసం అయినా తెలంగాణను కాపాడుకుంటామన్నారు.
ఒక లక్షా 20 వేల కోట్ల నిధులను నీళ్ల పేరుతో దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. ఒకవేళ బాంబులు పెట్టినా.. ప్రాజెక్ట్ పైకి లేవాలి గానీ.. నీళ్లలో మునిగిపోదు అన్నారు. వచ్చే ఐదు ఏళ్లలో ఖమ్మంలో సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అర్థవంతమైనతో పాలనతో పాటు ఆర్థిక, క్రమశిక్షణ కలిగిన పాలన అందిస్తామని స్పష్టం చేశారు.