కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండకు రావాలి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ జిల్లా జిల్లా పర్యటనకు రావాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కూర్చీవేసుకొని SLBCని పూర్తి చేస్తామన్న కేసీఆర్ మాటతప్పారన్నారు. ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలన్నారు. కేసీఆర్ పర్యటనకు వ్యతిరేకంగా నల్లగొండ టౌన్ లో నిరసన చేపడతామన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజాయోగ్యమైందన్న కోమటిరెడ్డి... విమర్శించే స్థాయి ఎవకీ లేదన్నారు. ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింత ఫైలుపై సంతకం చేసిందే కేసీఆర్, హరీశ్ రావు అన్నారు కోమటిరెడ్డి. 

ALSO READ :- సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. బాల్కసుమన్ కు నోటీసులు

అన్ని రంగాల్లో బడ్జెట్ లో సమ ప్రాధాన్యత ఇచ్చామన్నారు.  కేసీఆర్ మోసం చేసి అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పులు రాష్ట్రంపై ఆర్థిక భారం పడిందని విమర్శించారు. త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పారు.  బడ్జెట్ పై విమర్శలు చేస్తున్న హరీశ్ రావు, కేటీఆర్  మూర్ఖులని ధ్వజమెత్తారు.  కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణ తెచ్చిండని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేసిందని చెప్పారు. అన్ని రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్..అని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని చెప్పారు.