
హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్టుల కోసమే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికను తీసుకొచ్చారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాజగోపాల్ ధనానికి, మునుగోడు ప్రజల బలానికి మధ్య ఈ ఎన్నిక జరుగుతున్నదని అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని రాజగోపాల్‌రెడ్డి, ఈ ఉప ఎన్నికలో మరోసారి ప్రజలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజగోపాల్ ధనదాహాన్ని, టీఆర్‌ఎస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విడమరిచి చెప్పాలని సూచించారు. రాజగోపాల్ రెడ్డి ఒక ఫెయిల్యూర్, అట్టర్ ఫ్లాప్ ఎమ్మెల్యే అని విమర్శించారు.
నాన్ రెవెన్యూ కోటాలోని..ఐఏఎస్ పోస్టులు భర్తీ చేయాలి
లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్లుగా గ్రూప్–1 అధికారులను నియమించాలని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్, హనుమంతు నాయక్ కోరారు. నాన్ రెవెన్యూ కోటాలో ఖాళీగా ఉన్న 5 ఐఏఎస్ పోస్టులు భర్తీ చేయాలంటూ సోమవారం బేగంపేట క్యాంప్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ను గ్రూప్–1 అధికారుల సంఘం నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు.