ఫార్ములా ఈ రేసుకు హాజరైన మంత్రి కేటీఆర్

ఫార్ములా ఈ రేసుకు హాజరైన మంత్రి కేటీఆర్

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ వేదికగా జరగడం ఆనందకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరాన ఉత్సాహంగా ప్రారంభమైన ఈ రేసింగ్ క్వాలిఫైంగ్ రౌండ్ కు హాజరైన మంత్రి కేటీఆర్.. నెక్లెస్ రోడ్డులో ఫార్ములా ఈ కార్లు వేగంగా దూసుకుపోతుంటే చూడటానికి ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఉన్న యువత, క్రీడాభిమానులు ఈ రేస్ ను చూసేందుకు తరలివస్తున్నారని చెప్పారు. ఈ ఈవెంట్స్ లో కొంత అసౌకర్యం కలుగుతుందన్నమాట నిజమేనన్న కేటీఆర్.. కానీ అది మన్నించి సహకరిస్తున్నందుకు నగరవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇంటువంటి కార్యక్రమాలతో హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, ఈ కార్యక్రమం సవ్యంగా, సాఫీగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.