ట్వీట్టర్ వేదికగా బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

ట్వీట్టర్ వేదికగా బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్‌ : తాంత్రిక పూజలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా మరోసారి విమర్శలు చేశారు. బండి సంజయ్‌ను ఇలాగే వదిలేస్తే మతిలేని మాటలు మాట్లాడి సమాజానికి ప్రమాదకరంగా తయారవుతారని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

బోర్డులు గుజరాత్‌కు.. బోడిగుండులు తెలంగాణకా..? 
కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో కొబ్బరి అభివృద్ధి బోర్డు (Coconut Development Board) ఏర్పాటుపై ట్వీట్‌ చేశారు.