ఎవరికి ఏ కష్టం వచ్చినా కేసీఆర్ మాత్రమే శ్రీ రామ రక్ష

ఎవరికి ఏ కష్టం వచ్చినా కేసీఆర్ మాత్రమే శ్రీ రామ రక్ష

హైద‌రాబాద్: బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. బీజేపీకి రాజీనామా చేసిన రావుల శ్రీధర్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్‌ పార్టీలో చేరిన సందర్బంగా ఆయన ప్రసంగించారు. కేంద్రానికి తాము 2.72 లక్షలు పన్నుల రూపంలో ఇచ్చామని, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది లక్షా 29 వేల కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు. నోట్ల రద్దుతో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన విమర్శించారు. ఎప్పటికైనా, ఎన్నటికైనా మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ అని, ఎవరికి ఏ కష్టం వచ్చినా కేసీఆర్ మాత్రమే శ్రీ రామ రక్ష అని అన్నారు.

ఎట్టి పని అయినా, మట్టి పని అయినా మనోడే వుండాలి. బీజేపీ, కాంగ్రెస్ లకు 29 రాష్ట్రాలు.. 29 అజెండా లు ఉంటాయి అని కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా కొందరు కళ్ళు తెరుచుకోవడం లేదని, వున్నవి లేనట్లు, లేనివి వున్నట్లు అభూత కల్పన కల్పిస్తున్నార‌ని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టిఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అని వూక దంపుడు ప్రసంగాలు చేశార‌ని, అవ‌న్నీ క‌ల్ల‌లే అయ్యాయ‌ని అన్నారు. మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తే అవి సఫలం కాదని హెచ్చ‌రించారు.