అధికారులపై మంత్రి కేటీఆర్ అసహనం

అధికారులపై మంత్రి కేటీఆర్ అసహనం

లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద నుంచి వీఎస్టీ వరకు నిర్మించే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిశీలించారు. ఆయనతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యంగా జరుగుతుందని అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మే చివరి నాటికల్లా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్ని శాఖల అధికారుల సమన్వయం, ప్రజా ప్రతినిధుల సహకారంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.