
సెబాస్టియన్ పీసీ 524తో ఇటీవల ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సమ్మతమే అనే ఓ మూవీని చేస్తున్నాడు. ఇందులో చాందినీ చౌదరీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. రిలీజ్ కి సమయం దగ్గర పడుతుడడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఈరోజు సాయంత్రం(జూన్ 16) 4:05కి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. జూన్ 24 న సమ్మతమే గ్రాండ్ గా రిలీజ్ కానుంది. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో సమ్మతమే రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమా పైన భారీ అంచాలను క్రియేట్ చేశాయి.
Thank you sir @KTRTRS ❤️
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) June 15, 2022
Trailer tomorrow 4:05pm #SammathameFromJune24th pic.twitter.com/Q2R7EbkPkx