కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

కేంద్ర ప్రభుత్వ  చట్టాలపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. రైతు చట్టాలు, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, సీఏఏ, ఎల్పీజీ ధరలతో పాటు అగ్నిపథ్‌ పథకం లాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ట్విటర్‌లో తప్పుబట్టారు. రైతులకు వ్యవసాయ చట్టాలు అర్థం కావు. వ్యాపారులకు   జీఎస్టీ అర్థం కాదు. సాధారణ పౌరుడికి నోట్ల రద్దు అర్థం కాదు. ముస్లింలకు CAA అర్థం కాదు. మహిళలకు LPG ధరలు అర్థం కావు. ఇప్పుడు అగ్నిపథ్‌ పథకం యువతకు అర్థం కాదు. వీటి అర్థం కేవలం విశ్వగురుకు మాత్రమే తెలియాలంటూ  కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అగ్నిపథ్‌ ఆందోళనలపై కూడా మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో  మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిరుద్యోగుల ఆందోళనలు దేశంలో నిరుద్యోగ సమస్యను ప్రతిబింబిస్తున్నాయన్నారు. గతంలో వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతుల జీవితాలతో ఆడుకుందన్నారు.  మొన్న ఒకే ర్యాంక్‌ - ఒకే పింఛను విధానం అన్న మోదీ సర్కారు.. ప్రస్తుతం  ర్యాంకు లేదు - పింఛను లేదనే ప్రతిపాదనతో  సైనికుల జీవితాలతో ఆడుకుంటోందని ఫైర్ అయ్యారు.