సీఎంను తిట్టిన‌ రేవంత్ ని వదిలేది లేదు

V6 Velugu Posted on Sep 19, 2021

హైదరాబాద్:  ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టిన రేవంత్ రెడ్డి పురుగులు పడి చస్తాడ‌ని.. ఎట్టిప‌రిస్థితుల్లో రేవంత్ ని వ‌దిలేది లేద‌ని ఫైర్ అయ్యారు మంత్రి మ‌ల్లారెడ్డి. ఆదివారం  జవహర్‌ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొంతమంది కార్యకర్తలు టీఆర్ఎస్‌లోకి చేరారు. మంత్రి మల్లారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీరియ‌స్ అయ్యారు. రేవంత్ ఒక లాఫుట్, డొకబాజీ, చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చినవాడని, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడుతారా.. అంటూ తీవ్రమైన పదజాలంతో రెచ్చిపోయారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని రూ. 50 కోట్లతో తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. సీఎం కేసీర్‌ను తిట్టడం ఎంటని ప్రశ్నించారు.

Tagged COMMENTS, Revanth reddy, Minister Malla Reddy,

Latest Videos

Subscribe Now

More News