- మంత్రి అజారుద్దీన్
అబిడ్స్, వెలుగు: ఈ నెల 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే ఉచిత చేప మందు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, చేప మందు కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
తాగునీటి ప్యాకెట్లు, మరుగుదొడ్లు, క్యూలైన్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. చేప మందు ప్రసాదం కోసం అవసరమైన చేప పిల్లలను సిద్ధంగా ఉంచుతున్నామని మెట్టు సాయికుమార్ తెలిపారు.
