ఖమ్మం రూరల్, వెలుగు: ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. ఆదివారం మున్సిపల్ఆఫీస్లో చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్చైర్పర్సన్తమ్మినేని నవీన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గాన్ని సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. -ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత పార్టీలకతీతంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని చెప్పారు.
వారానికి కనీసం 5 రోజులు ఉదయం 2 గంటలు వార్డులోనే ఉండాలన్నారు. 15 రోజులకో సమావేశం నిర్వహిస్తూ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశంపై చర్చించాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో నాలాల ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి వేడుకలో ఆత్మీయత
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో మదన్‌రెడ్డి దంపతులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఆదివారం గృహప్రవేశం జరుపుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరై, వారికి నూతన వస్త్రాలు పెట్టారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.
‘భూమి హక్కు చట్టాలు-పోకడలు’ ఆవిష్కరణ
ఖమ్మం, వెలుగు: భూ భారతి చట్టంపై స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, పాలేరు స్పెషల్ ఆఫీసర్ రమేశ్లోలేవార్రాసిన భూమి హక్కు చట్టాలు–పోకడలు అనే పుస్తకాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఖమ్మంలోని తన క్యాంప్ ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి చట్టంపై అవగాహనకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని తెలిపారు. ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఫస్లీ కాలం నుంచి ప్రస్తుత భూభారతి చట్టం వరకు జరిగిన పరిణామాలపై ఇందులో సమగ్ర వివరాలున్నాయని రచయిత రమేశ్పేర్కొన్నారు.
