అభివృద్ధిలో అశ్వారావుపేటను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అభివృద్ధిలో అశ్వారావుపేటను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అశ్వారావుపేట, వెలుగు : రాష్ట్రంలోనే అశ్వారావుపేట మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన పాలకవర్గ సభ్యులకు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో అశ్వారావుపేట మున్సిపల్​చైర్ పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్ పర్సన్ జూపల్లి రమేశ్ సోమవారం హైదరాబాద్ లోని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జూపల్లి దంపతులను మంత్రి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరిని కలుపుకొని పోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలిపారు.