నేడు (జూలై 22) ముఖాముఖిలో పాల్గొననున్న మంత్రి పొంగులేటి

నేడు (జూలై 22) ముఖాముఖిలో పాల్గొననున్న మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్‌లో బుధవారం నిర్వహించనున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగనుందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.

ప్రజలు, పార్టీ కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సమస్యలు ఉన్నవారు తమ విజ్ఞప్తులను దరఖాస్తుల రూపంలో తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు.