కూకట్పల్లికి సిటీ బస్సుల్లో వెళ్తూ వస్తుంటారా? మీకో గుడ్ న్యూస్

కూకట్పల్లికి సిటీ బస్సుల్లో వెళ్తూ వస్తుంటారా? మీకో గుడ్ న్యూస్

హైదరాబాద్ సిటీ వాసులకు.. ముఖ్యంగా కూకట్ పల్లి ఏరియా మీదుగ వెళ్లి వచ్చేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సిటీలో అత్యధికంగా జనాభా రవాణా సాగించే కూకట్ పల్లి పరిసర ప్రాంతాలకు ఒకేసారి 60 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది ప్రభుత్వం. అందులో భాగంగా రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ 2026 మే 27న 60 బస్సులను చెండా ఊపి ప్రారంభించారు. ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఆర్టీసీ భాగస్వామ్యంతో ఓలెక్ట్రా తయారు చేసిన 12 మీటర్ల లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి డిపోలో బుధవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ప్రారంభించారు. 

500 ఎలక్ట్రిక్​బస్సుల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంటోన్మెంట్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీయూ , మియాపూర్, హయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, రాణిగంజ్ డిపోలకు 440 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వగా, బుధవారం కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి డిపోకు 60 బస్సులు ఇచ్చారు. ప్రస్తుతం సిటీలో రోజుకు లక్ష మంది ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగిస్తుండగా, కొత్తగా వచ్చే బస్సులతో కలిపి ప్రయాణికుల సంఖ్య 1.2 లక్షలకు చేరే అవకాశం ఉంది.

మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్:

  • కాలుష్యంలో హైదరాబాద్ మరో ఢిల్లీ లా మారొద్దని ఎలక్టిక్ బస్సులను తీసుకొస్తున్నాం 
  • 540 ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ లోనే తిప్పుతున్నాం 
  • రాష్ట్రంలో దాదాపు 1000 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నాం
  • గ్రేటర్ పరిధిలో 2200 ఈవీ బస్సులను దశలవారీగా తీసుకొస్తున్నాం
  • త్వరలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు జరుపుతాం 
  • ఎన్నికైన సంఘాలతో ఆర్టీసీ విలీన పక్రియ ప్రారంభిస్తాం 
  • ఆర్టీసీ కార్మికులకు PRC అమలు చేస్తాం 
  • ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం 
  • ప్రతి రెండో మంగళవారం డిఎం లు, ఆర్ఎంలు, ఎండి సమక్షంలో కార్మికుల సమస్యలను తీర్చేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తాం, కార్మికుల సమస్యలు తెలుసుకుంటాం
  • జంట నగరాలలో  35 లక్షల ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకుంటున్నారు 
  • కొత్త నియామకాలు, కొత్త బస్సులతో  ఆర్టీసీదేశం లోనే ఉత్తమంగా నిలుస్తోంది
  • గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజా రవాణాను బలోపితం చేసేందుకు ఆర్టీసీ ఎంఎంటీఎస్ మెట్రో తో కలిసి లాస్ట్ మెయిల్ కనెక్టివిటీని తీసుకొస్తాం
  • ఔటర్ రింగ్ రోడ్డు వద్దనే బస్సు టర్మినల్స్ నుంచి ప్రజలను తీసుకొచ్చేందుకు సిటీ ఆర్టీసీ బస్సులను వినియోగిస్తాం
  • డీజిల్ , పెట్రో ధరలు పెరుగుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రాధాన్యత పెరిగింది
  • ఓ ఆర్ ఆర్ చుట్టూ బస్సు లు కొత్త ఆర్టీసి టర్మినల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది
  • హైదరాబాదులో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ప్రజారావాణాను పెంచాల్సిన అవసరం ఉంది
  • సిటీ ట్రాఫిక్ లో అంబులెన్స్ లకు బాధ్యత యుతంగా దారి ఇవ్వాలి
  • రీసెంట్ గా ట్రాఫిక్ లో ఇరుక్కున్న అంబులెన్స్ లో ఒకరు మరణించడం బాధాకరం
  • మహిళకు ఉచిత ప్రయాణం తో పాటు బస్సులు కొనుగోలు చేయడం తో పాటు మహిళలను యజమానులు గా చేశాం.
  • కూకట్ పల్లి డిపో విస్తరణ లో భాగంగా 5 ఎకరాల స్థలంలో డిపో ఏర్పాటు చేసేలా జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులు హౌసింగ్ బోర్డు అధికారులుకి లేఖ రాయాలి అని సూచించారు.
  • హైదరాబాద్ లో కొత్త కాలనీలు పెరుగుతూ వస్తున్నాయి.. దానికి తగ్గట్టుగానే ప్రజా రవాణా వ్యవస్థ ను కూడా బలోపేతం చేస్తున్నాం.
  • ఆర్టీసీ కార్మికులు సమస్యలు అన్ని త్వరలోనే పరిష్కారం అవుతాయి. సంస్థ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలి.
  • ఇక నుంచి కూకట్ పల్లి లో కాలుష్య రహిత ప్రాంతంగా చేసేందుకు ఈ వి బస్సులు రోడ్ల పై తిరుగుతాయి.