పెబ్బేరు: విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆగ్రహం

పెబ్బేరు: విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు..ఇరిగేషన్ అధికారులపై  ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆగ్రహం

పెబ్బేరు, వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధికారులను హెచ్చరించారు. సోమవారం వనపర్తి జిల్లా పెబ్బేరు ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. శాఖల వారీగా అన్ని సమస్యలు, ప్రభుత్వ సేవలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్, విద్యుత్, అంగన్వాడీల పనితీరుపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్న అధికారులను గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు. 

పెబ్బేరు పట్టణంలో 30 పడకల పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ నిర్మాణం స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జరుగుతోందన్నారు. గుడిసెలు లేని జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దాలని, ఇందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అంతకుముందు  శ్రీరంగాపూర్​ మండలకేంద్రంలోని కేజీబీవీ, జడ్పీహెచ్​ఎస్​, ప్రైమరీ స్కూళ్లను సందర్శించారు. ప్రైమరీ స్కూలులో ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. మహిళా సమాఖ్య భవనానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోదిని, సింగిల్ విండో అధ్యక్షుడు కోదండరామిరెడ్డి, జడ్పీ సీఈవో యాదయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.