RCFLలో 94 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మంచి ఛాన్స్.. డిగ్రీ ఉంటే చాలు..

 RCFLలో 94 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు మంచి ఛాన్స్.. డిగ్రీ ఉంటే చాలు..

రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్ సీఎఫ్ఎల్) మేనేజ్‌‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 94. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఈ/ బి.టెక్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ ఎంకాం, ఎంబీఏ/ ఎంఎంఎస్/ పీజీడీఎం పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 27 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 8.

అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మన్, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. 

లాస్ట్ డేట్: ఆగస్టు 24.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.rcfltd.comను సందర్శించండి.