తొలి సినిమాతోనే దర్శకుడిగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడం చాలా ఆనందంగా ఉందని రవి నంబూరి చెప్పాడు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా తను రూపొందించిన ‘చెన్నై లవ్‌స్టోరీ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు రవి నంబూరి మాట్లాడుతూ ‘ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు సరైన రీతిలో అందించగలిగాననే నమ్మకం ఈ విజయం కలిగించింది.
బాక్సాఫీస్ వసూళ్ల కంటే ప్రేక్షకుల ప్రశంసలు మరింత సంతృప్తిని ఇచ్చాయి. సాయి రాజేష్ ఇచ్చిన అవకాశమే నా కెరీర్‌ను మలుపు తప్పింది. కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ నటనతో పాటు మణిశర్మ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. తొలి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత ఎస్‌కేఎన్‌తోనే నా నెక్స్ట్ సినిమా ఉంటుంది. అది నా సొంత కథతో ఫ్యామిలీ, యూత్ ఎంటర్‌టైనర్‌గా, ఎమోషన్స్‌కు ప్రయారిటీ ఇచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు.
