‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ఆకట్టుకున్న యువ హీరో మౌళి తనూజ్ ప్రశాంత్.. త్వరలో మరో ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. అనిల్ ఎర్నేని సహ నిర్మాత. సోమవారం ఈ చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్ ఇదని అర్థమవుతోంది. సుష్మిత శెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తున్నాడు.
