కొడిమ్యాల, వెలుగు: కొడిమ్యాల మండలంలో గౌడ కులస్తులు ప్రతి ఐదేండ్లకోసారి జరుపుకునే ఎల్లమ్మ సిద్దోగాల ఉత్సవాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. సాయంత్రం సమయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉత్సవాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ జీవన్‌రెడ్డి, ఉపసర్పంచ్ నర్సయ్య, రాజనర్సిందరావు పాల్గొన్నారు.
