ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అందరూ ప్రజల కోసం పని చేయాలి : పొన్నం

ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అందరూ ప్రజల కోసం పని చేయాలి : పొన్నం

అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా పాలన కార్యక్రమంపై అధికారులతో మంగళవారం (డిసెంబర్ 26న) రివ్యూ చేశారు మంత్రి పొన్నం. డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుండి విజ్ఞప్తులు తీసుకుంటామన్నారు. జనం ఇబ్బందులను దూరం చేసే విధంగా తమ సర్కార్ పని చేస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంఅప్పుల పాల్జేసిందన్నారు. 

శ్వేత పత్రం,స్వేద పత్రం అనే అంశాలను పక్కన పెట్టి.. జనం కోసం అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొత్తం 4 వేల 800 మంది సిబ్బందిని ఉపయోగించుకొని.. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి దరఖాస్తుకు ఒక రిసిప్ట్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు.. తర్వాత అందరూ ప్రజల కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.