
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ మంత్రి రోజా. ఇక ఆయనకు మిగిలింది.. కేఏ పాల్ జెండా మాత్రమే అంటూ ఎద్దేవ చేశారు. జనసేన పార్టీ అసలు ఎందుకు పెట్టారో పవన్కే తెలియాలనన్నారు. రాజకీయాల్లో ఎవరైనా తన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారని.. కానీ పవన్ మాత్రం..మరొకరి జెండా మోయడానికి పార్టీ పెట్టారని ఆమె ఆరోపించారు. పవన్ ఎప్పుడూ టీడీపీ, బీజేపీ జెండా మోస్తూ వారికే ఓటు వేయాలని కోరతారని రోజా అన్నారు.
పవన్‌కు ఆ ఒక్కటే మిగిలింది
ప్రస్తుతం పవన్ మోయాల్సిన జెండా ఏదైనా మిగిలింది అంటే.. అది కేఏ పాల్ జెండా మాత్రమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో అది కూడా పవన్ మోసేస్తే గిన్నిస్ బుక్ ఎక్కేయ్యచ్చు అని సెటైర్లు వేశారు. తన పార్టీకి ఓటేయకుండా.. ప్యాకేజీల కోసం పక్క పార్టీకి ఓటేయండి అని పిలిచే పవన్ వెనుక ఇంకా ఆ పార్టీ వారు ఉండాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రియపడ్డారు..