తాత్కాలిక పండ్ల మార్కెట్‎ను ప్రారంభించిన మంత్రి సబిత

తాత్కాలిక పండ్ల మార్కెట్‎ను ప్రారంభించిన మంత్రి సబిత

హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్‎ను సర్కార్ ఎట్టకేలకు తరలించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం బాట సింగారంలో తాత్కాలిక పండ్ల మార్కెట్‎ను దసరా సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితతో పాటు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్  రద్దీని కంట్రోల్ చేసేందుకే  గడ్డిఅన్నారం నుంచి పండ్ల మార్కెట్‎ను తరలించామని మంత్రి సబిత చెప్పారు. సర్కార్ నిర్ణయానికి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు సహకరించాలని లీడర్లు కోరారు. 

వ్యాపారులంతా సహకరిస్తే వీలైనంత త్వరలోనే కొహెడలో శాశ్వత ప్రాతిపదికన అంతర్జాతీయ ప్రమాణాలతో అతి పెద్ద మార్కెట్ నిర్మిస్తామని మంత్రి సబిత అన్నారు. అప్పటి వరకు పండ్ల అమ్మకాలు, కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సబిత తెలిపారు.