ములుగు, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ సేవ చేయాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం ములుగు మండలం ఇంచర్ల లో జిల్లా స్థాయిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు 12 శాఖలపై శిక్షణ తరగతులు నిర్వహించారు.
మహిళా, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖలపై ఉదయం జిల్లా కలెక్టర్ దివాకర్ టి. ఎస్. శిక్షణను ప్రారంభించారు. మధ్యాహ్నం మంత్రి సీతక్క హాజరై మిగిలిన శాఖల శిక్షణలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని, మరో 1,200 కోట్లు రావాల్సి ఉన్నాయని, ఆ నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అవగాహన పొందిన ప్రతినిధులు తప్పకుండా అమలు చేయాలని సూచించారు.
పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మహబూబాబాద్ : పట్టణంలోని పీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా స్థాయిలో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక, 99 రోజుల ప్రొగ్రామ్‌లో భాగంగా సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని సొంత ఇంటితో సమానంగా భావించుకోవాలని, కార్యక్రమంలో ప్రభుత్వ విప్ , డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ పాల్గొన్నారు.
