హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే భక్తుల భద్రతపై తమ ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచె ఈ మహాజాతర ప్రతి భక్తుడి హృదయంలో భక్తి భావాన్ని నింపాలని, జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి శాంతి, ఆనందం కలగాలని ఆమె ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యం కోసం సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు.
