ఆగస్టు 5 నుంచి శానిటేషన్ డ్రైవ్

ఆగస్టు 5 నుంచి శానిటేషన్ డ్రైవ్
  • నేడు ఆఫీసర్లతో మంత్రి సీతక్క కాన్ఫరెన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ నెల 5 నుంచి శానిటేషన్ డ్రైవ్ స్టార్ట్ కానుంది. 'పచ్చదనం–స్వచ్ఛదనం' పేరిట వారంపాటు ఈ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పల్లె, పట్టణ ప్రగతి తరహాలో ఈ కార్యక్రమం జరగనుంది.ఇందులో భాగంగా అర్బన్, రూరల్ లోకల్ బాడీల్లోని  రోడ్లు క్లీన్ చేయనున్నారు. 

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను ప్రభుత్వం గురువారం రిలీజ్ చేయనుంది. మున్సిపల్, కార్పోరేషన్ అధికారులు,  జిల్లా పంచాయతీ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్ల నుంచి మున్సిపల్ కమిషనర్ల వరకు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది.