హైదరాబాద్​లో మెడ్​ట్రానిక్​ ఆఫీసు ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్​లో మెడ్​ట్రానిక్​ ఆఫీసు ప్రారంభించిన మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్, వెలుగు: మెడికల్ టెక్నాలజీ కంపెనీ మెడ్‌‌ట్రానిక్ హైదరాబాద్‌‌లో నిర్మించిన మెడ్‌‌ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎంఈఐసీ)ను  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌‌బాబు గురువారం ప్రారంభించారు. మెడ్‌‌ట్రానిక్ ఛైర్మన్,  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జియోఫ్ మార్తా, యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఐదేళ్లలో మెడ్‌‌ట్రానిక్  ఇన్వెస్ట్​ చేయనున్న సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడిలో ఈ విస్తరణ భాగం. ఇక్కడ ప్రస్తుతం 900 మంది పనిచేస్తున్నారని, ఈ సంఖ్యను భవిష్యత్తులో 1,500 మందికి పెంచుతామని కంపెనీ ప్రకటించింది. ఎంఈఐసీ  అమెరికా​ వెలుపల మెడ్‌‌ట్రానిక్​కు అతిపెద్ద ఆర్ అండ్​ డీ కేంద్రం.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య పరికరాల తయారీ  పరిశోధన, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు.