- కేంద్రంలో కాంగ్రెస్ రావడం ఖాయం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్జనజాతర సభలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
భారత్‌జోడో యాత్రపేరుతో కన్యా కుమారి నుంచి కాశ్మీర్వరకూ పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని గుర్తుచేశారు. న్యాయ్‌యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా 10 వేల కి.మీ. పాదయాత్ర చేసి యువత, మహిళలు, రైతులు, కార్మికుల సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు. అందుకే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి వెల్లడించారు.
పాంచ్ న్యాయ్అమలు చేస్తం
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో బీసీ కుల గణనను ప్రభుత్వం మొదలు పెట్టిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని.. ఆరో గ్యారంటీగా ఇందిరమ్మ ఇండ్లను కూడా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పార్లమెంట్ఎన్నికల సందర్భంగా రాహుల్కాంగ్రెస్ తరఫున పాంచ్ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారని చెప్పారు. "2024 ఎన్నికలు~ మార్పు కోసం" అనే నినాదంతో ముందుకు పోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేసినట్టుగానే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాంచ్‌న్యాయ్ గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.