కల్తీ మద్యం దిగుమతి అవుతుంది..జాగ్రత్త: మంత్రి శ్రీనివాస్ గౌడ్

కల్తీ మద్యం దిగుమతి అవుతుంది..జాగ్రత్త:  మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు తీసుకురావడం చట్టరీత్యా నేరమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణలో తయారు చేసిన మద్యం బాటిళ్లను మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయాలని సూచించారు. వారం రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు 1,333 మద్యం బాటిళ్లు దిగుమతి అయ్యాయని మంత్రి వెల్లడించారు. ఒరిస్సా అడవుల్లో అక్రమంగా మద్యం తయారు చేసి.. తెలంగాణలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు. హర్యానా నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని కూడా పట్టుకున్నామన్నారు. ఈ మద్యం కల్తీ అవుతుందని మంత్రి చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే.. ఒక్కోవ్యక్తికి రెండు బాటిళ్లు అనుమతి ఉందని మంత్రి గుర్తుచేశారు. 

ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో 80కి పైగా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 300 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గోవా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి విమానంలో హైదరాబాద్ కు మద్యం బాటిళ్లను తరలిస్తుండగా పోలీసులు వాటిని గుర్తించి సీజ్ చేశారు. ఇతర రాష్ట్రల నుంచి దుండగులు మద్యం సరఫరా చేస్తే.. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా నష్టం జరుగుతదని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహరానికి సంబంధించిన నిందితులను పట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.