హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 'చీఫ్ మినిస్టర్స్ కప్' పేరిట క్రీడలు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఇందుకోసం రూ.3.60 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై ఆయన బుధవారం రివ్యూ నిర్వహించారు.
గ్రామీణ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కొత్తగా 76 స్టేడియాల ఏర్పాటుకు అనుమతులిచ్చినట్లు తెలిపారు. అందులో ఇప్పటికే 50 శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు. దాదాపు 19 వేల గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టగా.. ఇప్పటికే 15 వేల పైచిలుకు పూర్తి చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
