దేశంలోనే అతిపెద్ద మెగా డైరీకి శంకుస్థాపన

దేశంలోనే అతిపెద్ద మెగా డైరీకి శంకుస్థాపన

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రావిర్యాలలో మెగా డైరీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. దేశంలోనే ఆదర్శవంతమైన మెగా డైరీ రావిర్యాలలో నిర్మాణం కావడం ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. ఈ డైరీ ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన వర్క్ షాపును వారు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘ఇది ఒక సువర్ణ అధ్యాయం. తెలంగాణ రాక ముందు విజయ డైరీ మూత పడే పరిస్థితిలో ఉండే. ప్రస్తుతం ప్రైవేట్ కాంపిటీషన్ తట్టుకుని ముందుకెళ్తున్నాం. 2014లో 3 కోట్ల టర్నోవర్ ఉంటే... ప్రస్తుతం ఏడున్నర కోట్ల టర్నోవర్ తో ముందుకెళ్తున్నాం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రావిర్యాలలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తున్నాం. 
ప్రస్తుతం విజయడైరీ ఉత్పత్తులు 28 ఉన్నాయి. మెగా డైరీ అందుబాటులోకి వచ్చాక 50 రకాల ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తాం. పాడి రైతులను ప్రోత్సహించేందుకు 4 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తున్నాం. డైరీ రంగంలో చాలా కాంపిటీషన్ ఉంది. విజయడైరీ ఆధ్వర్యంలో పూర్తి సంవత్సర కాలంపాటు పాలను కొనుగోలు చేస్తున్నాం. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే. కొంతమంది నాయకులు అనసరపు ఆరోపణలు చేస్తున్నారు. చనిపోయిన గేదెలకు సంబందించిన ఇన్సూరెన్స్ 15 రోజుల్లో వచ్చేలా చేస్తాం. కుల వృత్తులను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఇంట్లో విజయ బ్రాండ్ ఉత్పత్తులు కోరుకుంటారు. దేశంలోనే ఆదర్శవంతమైన మెగా డైరీ రావిర్యాలలో నిర్మాణం కావడం ఎంతో గర్వకారణం. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రైతులకు మేలు జరుగుతది. 
రంగారెడ్డి జిల్లా రైతులకు పాడి పశువులను సబ్సిడి కింద ఇచ్చేందుకు పైలెట్ ప్రాజెక్టు చేపడుతాం’ అని మంత్రి తలసాని అన్నారు.

ప్రైవేట్ డైరీలకు పాలు పొయొద్దు: సబితా ఇంద్రారెడ్డి

‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాయి. విజయడైరీకి సంబందించి సీఎం కేసీఆర్ చాలా గొప్పగా చెప్తారు. గతంలో చేపలు దొరికెవి కావు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఏ చెరువులో చూసిన చేపలు కనిపిస్తున్నాయి. విజయడైరీలో చాలా ఉత్పత్తులు పెరుగుతున్నాయి. పది రూపాయలు ఎక్కువొస్తున్నాయని ప్రైవేట్ డైరీలకు పాలు పొయొద్దు. ప్రతి పాడి రైతు విజయడైరీకే పాలు పోయాలి. రంగారెడ్డి జిల్లా పాడి రైతులకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలి’ అని ఆమె అన్నారు.