ఏ అవసరమున్నా సాయం చేస్తా: తలసాని శ్రీనివాస్‌ యాదవ్

ఏ అవసరమున్నా సాయం చేస్తా:  తలసాని శ్రీనివాస్‌ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: నియోజకవర్గ ప్రజలకు 24  గంటలు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా తాను సాయం చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ బర్కల్ బస్తీలో సీవరేజ్ పైప్‌లైన్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీలో ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కరించానని చెప్పారు.  

అర్హులైన వారందరికి దళిత బంధు, గృహలక్ష్మి కింద ఆర్థికసాయం అందే విధంగా చూసే బాధ్యత తనదేనని ప్రకటించారు.  కార్యక్రమంలో కార్పొరేటర్  హేమలత, ఈఈ సుదర్శన్, వాటర్‌‌ వర్క్స్ సీజీఎం ప్రభు, డీజీఎం శశాంక్,  శానిటేషన్‌ డీఈ శ్రీనివాస్, సికింద్రాబాద్‌ తహశీల్దార్ పాండు నాయక్‌, బస్తీ అధ్యక్షుడు నరేశ్, బన్సీలాల్ పేట డివిజన్‌ బీఆర్‌‌ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, నేతలు  ప్రేమ్ కుమార్, కుమార్ యాదవ్ పాల్గొన్నారు.