హైదరాబాద్, వెలుగు: రైతులకు ఆధునిక టెక్నాలజీని పరిచయం చేయాలని అగ్రికల్చర్వర్సిటీ సైంటిస్టులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే అన్నదాతలు సాగు చేయాలని, పంట మార్పిడి విధానాలను అనుసరించాలన్నారు. శనివారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్అగ్రికల్చర్వర్సిటీలో నిర్వహించిన విత్తన వారోత్సవాలు–2026 కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో కూలీల కొరత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్రోన్ల వినియోగం కీలకమని చెప్పారు. ఎస్బీఐ సీఎస్సార్నిధులతో అభివృద్ధి చేసిన రోబోటిక్స్, సెన్సార్ ఆధారిత ప్రయోగశాలను సందర్శించారు. వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా రోబోలను అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు. అనంతరం ఆర్ఎస్అండ్జీఐఎస్ల్యాబ్ను పరిశీలించారు.
రాష్ట్రంలోని దాదాపు 9.3 శాతం భూమి సాగులో లేదని అధికారులు మంత్రికి వివరించారు. రైతులు కొన్ని ప్రైవేట్ విత్తన కంపెనీల మాయ మాటలకు మోసపోకుండా వర్సిటీ అందిస్తున్న నాణ్యమైన విత్తనాలను వినియోగించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించాలని మంత్రి చెప్పారు.
10 మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, పరిశోధన డైరెక్టర్డాక్టర్ మరాఠి బలరామ్, బాలాజీ నాయక్, నీలిమ, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, చంద్రమోహన్ పాల్గొన్నారు.
