వాసవి పారాయణానికి వెల్లువలా తరలిరావాలి : మంత్రి వాకిటి శ్రీహరి 

వాసవి పారాయణానికి వెల్లువలా తరలిరావాలి : మంత్రి వాకిటి శ్రీహరి 

జూబ్లీహిల్స్ , వెలుగు: -ఈ నెల 22 నుంచి ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న వాసవి పారాయణం కార్యక్రమానికి వెల్లువలా తరలిరావాలని త్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌‌‌‌ పార్క్ హయత్ హోటల్లో తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాసవి పారాయణం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని  ఘనంగా నిర్వహించారు.

దీనికి మంత్రి వాకిటి శ్రీహరి, సమాచార,  ప్రజాసంబంధాల శాఖ  స్పెషల్ కమిషనర్ ప్రియాంక పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కార్యక్రమానికి కనీసం 40 వేల మందికి తగ్గకుండా ఆర్య వైశ్యులు పాల్గొని ఆధ్యాత్మిక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.