- మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం నుంచి చెల్లింపులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం 2.45 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించింది. 55,904 మంది రైతులకు రూ.588 కోట్లను శుక్రవారం నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు మార్క్‌ఫెడ్ అధికారులకు మంత్రి తుమ్మల ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.బ్యాంకు గ్యారెంటీ ప్రక్రియ పూర్తవ్వడానికి చెల్లింపులకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతోనే మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకుంటున్నదని చెప్పారు. “కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా.. రాష్ట్ర రైతులు నష్టపోకూడదనే సంకల్పంతో ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసింది. రైతును ఆదుకోవడం మా కర్తవ్యం. అదే మా అత్యున్నత ప్రాధాన్యత” అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

