పత్తికొనుగోలుపై కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్

పత్తికొనుగోలుపై కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్

పత్తి కొనుగోళ్లు, జిన్నింగ్ మిల్లుల సమస్యలపై ఫోకస్ పెంచారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. నవంబర్ 17న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో సెక్రటరీ, జౌళిశాక ,అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం కోరినట్టుగా రాష్ట్రం నుండి జిల్లాల వారిగా సరాసరి పత్తి దిగుబడి గణాంకాలను కలెక్టర్ల ద్వారా తెప్పించుకొని, సీసీఐకి పంపించడం జరిగిందన్నారు.  మొదట్లో ఎకరానికి 11 క్వింటాళ్ల చొప్పున సేకరించి, కొన్ని రోజుల తరువాత ఆ పరిమితిని 7 క్వింటాళ్లకు తగ్గిస్తూ, ఎకరానికి 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొంటామని రైతులను అయోమయానికి గురిచేశారు. ఈ విషయంలో కూడా ఎన్నోసార్లు కేంద్రాన్ని విజ్ఙప్తి చేసినట్టుగా మంత్రి తెలియజేశారు.ప్రభుత్వాలపై నమ్మకాలను ఉంచి, కొనుగోలు కేంద్రాలకు పంటలను తీసుకొస్తే, అక్కడికి వచ్చాక కేంద్రం పెట్టిన నిబంధనలతో రైతులకు దిక్కతోచని పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి తుమ్మల అన్నారు. 

ఇంతకుముందు పెసళ్లు, కందులు, పొద్దుతిరుగుడ వంటి పంటలపై 25శాతం కొనుగోలు మాత్రమే పరిమితి పెట్టి, రైతుల పంటలో కేవలం 25 శాతం మాత్రమే కనీస మద్ధతు ధరకు అమ్ముకుని, మిగతా పంటను తక్కువ ధరకు అమ్ముకోవల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నోసార్లు 25 శాతం పరిమితిని ఎత్తివేయాలని కోరినట్టు గుర్తుచేశారు. చివరికి రైతులు ఆర్థికంగా నష్టపోకుడదనే ఉద్దేశంతో రాష్ట్రమే మద్ధతు ధర చెల్లించి, గత రెండు సంవత్సరాల నుండి మిగిలిన పంటలను కొనుగోలు చేస్తుందని మంత్రిగారు అన్నారు.

►ALSO READ | పారా స్విమ్మర్ అజీమ్ కు మంత్రి వాకిటి సన్మానం

ఇక సోయాబీన్ విషయంలో అకాల వర్షాలు పడి, సోయాబీన్ రంగు మారగానే, రంగు మారిందనే నెపంతో కొనుగోళ్లు జరపకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రంగు మారిన పంటను కూడా కొనాలని కేంద్రాన్ని కోరుతున్నప్పటికి పట్టించుకోలేదని, నాఫెడ్ నుండి గాని, కేంద్రం నుండి గాని ఎటువంటి స్పందన లేకపోవడం శోచనీయం. కొనే 25శాతం పంటకి ఇన్ని నిబంధనలా అని మంత్రి ప్రశ్నించారు.