ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్ మొహమ్మద్ అజీమ్ ను ఘనంగా సన్మానించారు మంత్రి వాకిటి శ్రీహరి. నగరంలోని గచ్చిబౌలిలో జరుగుతున్న 25 వ పారా నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో కేరళ రాష్ట్రానికి చెందిన అజీమ్ 3 స్వర్ణ పథకాలు సాధించాడు. ఈ సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా మంత్రి వాకిటి శ్రీహరిని కలిశారు.గోల్డ్ మెడల్స్ సాధించినందుకు అజీమ్ ను ఆప్యాయంగా హత్తుకొని మరీ అభినందించారు.
పుట్టుకతోనే అంగవైకల్యంతో రెండు చేతులు లేకున్నా, ఒక కాలు చిన్నదిగా ఉన్నా కూడా స్విమ్మింగ్ లో ప్రతిభ కనబరచి మూడు గోల్డ్ మెడల్స్ సాధించడం అంత ఆశామాషీ విషయం కాదన్నారు మంత్రి వాకిటి. ఇప్పుడున్న యువత కు స్ఫూర్తి గా మొహమ్మద్ అజీమ్ నిలిచాడన్నారు . 2028 లో జరిగే పారా ఒలింపిక్స్ కు అర్హత సాధించినందుకు అజీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పారా ఒలింపిక్స్ లో కూడా మరిన్ని గోల్డ్ మెడల్స్ సాధించాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
పారా స్విమ్మర్ మొహమ్మద్ అజీమ్ మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించి మంత్రి సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్విమ్మర్ క్వీన్ విక్టోరియా గారి సహకారంతో, కోచ్ ల పర్యవేక్షణ తో నేను ఈ విజయం సాధించగలిగానని అజీమ్ తెలిపారు. 50 మీటర్, 100 మీటర్ ఫ్రీ స్టైల్, 50 మీటర్ బ్యాక్ స్ట్రోక్ లో మూడు స్వర్ణాలను సాధించాడు మొహమ్మద్ అజీమ్.
