రైస్‌ మిల్లర్లకు వేధింపులు ఉండవు.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి

రైస్‌ మిల్లర్లకు వేధింపులు ఉండవు.. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి
  • పీడీఎస్ బియ్యం జోలికి మిల్లర్లు వెళ్లొద్దు
  • రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు

హైదరాబాద్: రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వేధింపులు ఉండవని  పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ మాదాపూర్‌ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు  జరిగే  మూకాంబికా రైస్‌, గ్రెయిన్‌టెక్‌ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.  ప్రదర్శనలో   బహుళజాతి, ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన 120 స్టాళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రైస్‌ మిల్లింగ్‌ పరిశ్రమను ముఖ్యమైన రంగంగా గుర్తిస్తామన్నారు.  రైస్‌ మిల్లింగ్‌ వ్యాపారం, అనుమతులు, స్థాపన సులభతరం చేస్తామని ఆయన తెలిపారు. రైతులు, మిల్లర్లకు మేలు జరిగేలా చూస్తామన్నారు.

నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందించాలని సూచించారు. మిల్లర్లు ఎవరూ పీడీఎస్ బియ్యం జోలికి వెళ్లవద్దన్నారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన ఆయన హెచ్చరించారు.